‘గిరిజనేతరులకు ఎస్టీ హోదా’పై రేపు చర్చాగోష్ఠి

ABN , First Publish Date - 2023-06-03T01:56:40+05:30 IST

గిరిజనేతరులు అయిన బీసీ(ఎ)లో ఉన్న బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా కులస్తులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలో..

‘గిరిజనేతరులకు ఎస్టీ హోదా’పై రేపు చర్చాగోష్ఠి

గిరిజనేతరులు అయిన బీసీ(ఎ)లో ఉన్న బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా కులస్తులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ వేసింది. ఆ కమిషన్‌ నివేదిక ఆధారంగా మార్చిలో శాసనసభలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. దీనిని రాష్ట్రంలోని గిరిజనులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. గిరిజన జాబితాలో ఇతర కులాలను కలిపే ఈ కుట్రను తిప్పికొట్టే చర్యల్లో భాగంగా రేపు ఉదయం పది గంటలకు నరసరావుపేటలోని అరండల్‌పేటలో గల ఏంజిల్‌ టాకీసు వెనక ఉన్న సిపిఐ ఆఫీసులో చర్చాగోష్ఠి, రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరపాలని నిర్ణయించాం.

– గిరిజన రిజర్వేషన్‌ పరిరక్షణ కమిటీ, ఆంధ్రప్రదేశ్‌

Updated Date - 2023-06-03T01:56:40+05:30 IST