రైతు సేవకు పునరంకితం కావాలి: సండ్ర

ABN , First Publish Date - 2023-03-18T22:35:08+05:30 IST

వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ (ఆత్మ) కమిటీ సభ్యులు రైతు సేవలకు పునరంకితం కావాలనిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు.

రైతు సేవకు పునరంకితం కావాలి: సండ్ర
ఇళ్ల్లస్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌

సత్తుపల్లి, మార్చి 18: వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ (ఆత్మ) కమిటీ సభ్యులు రైతు సేవలకు పునరంకితం కావాలనిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. శనివారం సత్తుపల్లి ఆత్మ కమిటీ చైర్మన్‌ వనమా వాసు, సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నూతన ఆత్మ కమిటీ సభ్యులు రైతులకు పంటల సాగు పట్ల పూర్తి అవగా హన కల్పిస్తూ వారికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సత్తుపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఎంపీపీ దొడ్డా హైమావతిశంకరరావు, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్‌ మోదుగు పు ల్లారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కొత్తూరు ఉ మామహేశ్వరరావులు, వ్యవసాయ శాఖ సత్తుపల్లి ఏడీ నరసింహారావు, ఏవో వై.శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

ఇండ్లస్థలాల క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలి

తల్లాడ, మార్చి 18: జీవోనెంబర్‌ 58, 59 పరిధిలోకి వచ్చే లబ్ధిదారుల నుంచి ప్రభుత్వ స్థలాల్లోని ఇండ్ల క్రమబద్దీకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తల్లాడలోని రైతువేదికలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావుతో కలిసి 28మందికి ఇండ్లస్థలాల పట్టాలు, మరో 32మందికి కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 2020 జూన్‌ రెండోతేదీ వరకు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న అర్హులైన పేదల స్థలాలను జీవోనెంబర్‌ 58,59ద్వారా క్రమబద్దీకరించేందుకు వచ్చేనెల ఒకటి నుంచి 30వతేదీ వరకు క్రమబద్దీకరణ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఎంపీడీవో బి.రవీందర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

వర్షంలో సైతం ఎమ్మెల్యే పరామర్శలు

మండలంలోని తల్లాడ, నారాయణపురం గ్రామాల్లో శనివారం సాయంత్రం జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. తల్లాడలో ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన బీఆర్‌ఎస్‌ బీసీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కోడూరి వీరకృష్ణను పరామర్శిం చారు. అక్కడి నుంచి నారాయణపురం గ్రామం వెళ్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన భీమిరెడ్డి చిన్నరాంరెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.

Updated Date - 2023-03-18T22:35:08+05:30 IST