రెబ్బవరంలో కాంగ్రెస్ జోడోయాత్ర
ABN , First Publish Date - 2023-03-18T22:33:42+05:30 IST
రెబ్బవరంలో శనివారం కాంగ్రెస్ నాయకులు బాదావత్ రాంమ్మూర్తినాయక్, కట్ల రంగారా వులు హాథ్‌సే హాథ్ జోడోయాత్ర నిర్వహించారు.

వైరా, మార్చి 18: రెబ్బవరంలో శనివారం కాంగ్రెస్ నాయకులు బాదావత్ రాంమ్మూర్తినాయక్, కట్ల రంగారా వులు హాథ్‌సే హాథ్ జోడోయాత్ర నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సైనికుల మాదిరిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జోడోయాత్ర ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు కట్ల సంతోష్, గుత్తా శ్రీనివాసరావు, సిద్ధూ, రామారావు, దేవరపల్లి వేణు, మోడేపల్లి అనంతరాములు పాల్గొన్నారు.