‘ఫిష్‌’కలంగా.. జమలాపురం చెరువు

ABN , First Publish Date - 2023-03-05T23:41:37+05:30 IST

బొచ్చెలు మూడు కిలోల వరకు తూగుతున్నాయి. బంగారుతీగలు బంగారంల లాగా మెరిసిపోతున్నాయి.

‘ఫిష్‌’కలంగా.. జమలాపురం చెరువు
చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు

ఎర్రుపాలెం, మార్చి 5: బొచ్చెలు మూడు కిలోల వరకు తూగుతున్నాయి. బంగారుతీగలు బంగారంల లాగా మెరిసిపోతున్నాయి. రవ్వలు ఐదు కిలోల వరకు పెరిగాయి. ఇలా ఎన్నో చేపలు వలలో చిక్కి మత్స్యకారులకు లాభాలనంది స్తున్నాయి. కొనుక్కుని కూరవండుకున్న వారి జిహ్వ‘చేప’ల్యాన్ని తీరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఉపోద్ఘాతమంతా జమలాపురం చెరువుకు వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఈచెరువుకు ప్రత్యేక స్థానం ఉంది. రుచితోపాటు చౌకగా చేపలు లభ్యమవుతాయనే పేరు ఉంది. ఫలితంగా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా పక్క ఏపీ నుంచి కూడా ప్రజలు చేపల కోసం జనం ఎగబడతారు. సుమారుగా 15 నెలల కాలంలో ఈ చెరువులో 2 నుంచి 5కేజీల వరకు బరువు తూగుతాయి.

రుచిలో మేటి జమలాపురం చెరువు చేప

యానాం ఫిష్‌మార్కెట్‌లో దొరికే పులస చేపకు ఎంత క్రేజ్‌ ఉందో దాదాపుగా రుచిలో సరిసమానంగా జమలాపురం చేప అమోఘంగా ఉంటుదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి నేలలో క్షారత్వం తక్కువగా ఉండం చేత సులువుగా ఆక్సీకరణం జరుగుతుంది. దానిలోపాటు భూమిలో నత్రజని, భాస్వరం సేంద్రియ కర్బనం వల్ల చేపలు వేగంగా పెరుగుతాయి. అందువేల్ల ఇక్కడి చేపలు రుచిగా ఉంటాయని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌ కాలువను ఈ చెరువుకు అనుసం ధానించడం వల్ల ఎకుకవశాతం ఫ్లకవాలు విడుదలయ్యి చేపలు త్వరగా బరువు పెరుగుతాయని చెబుతున్నారు. వీటితో పాటు మత్యకారలుపశువుల పేడ, యూరియా, సూపర్‌ఫాస్పెట్‌ లాంటి సహజమైన ఎరువులు వాడకం వల్ల చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఈచేపల కోసం ఆదివారం జమలాపురం పెద్ద చెరువు వద్ద ఉదయం నుంచే జనం బారులు తీరారు.

ఫలితాలనందిస్తున్న చేపపిల్లల పంపిణీ

మత్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభ్వుం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. జమలాపురం పెద్ద చెరువుకు దాదాపుగా లక్షకు పైగా చేపపిల్లలను అందించింది. దానికితోడు అదనంగా మరో లక్షన్నర వరకు చేప పిల్లలను ప్రైవేటుగా కొనుగోలు చేసి పెంచారు. ఆదివారం ఒక్కరోజే దాదాపుగా తొమ్మిది టన్నుల చేపలు అమ్ముడుపోయాయని, ఇంకో 3 రోజులపాటు అమ్మకాలు కొనసాగుతాయని మత్య్యకారులు చెబుతున్నారు. మార్కెట్‌లో వీటి ధర కిలో రూ.200 ఉండగా చెరువవద్ద రూ.100 కు విక్రయిస్తున్నారు.

ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందించాలి

బూసిపొంగు జీవరత్నం, సొసైటీ అధ్యక్షుడు

జమలాపురం మత్యకార సహకార సంఘానికి దాదాపుగా వందమంది సభ్యు లున్నారు. ప్రసుఏ్తతం ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నా అవి సరిపోక ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. దాదాపుగా 300 ఎకరం విస్తీర్ణం కలిగిన ఈచెరువులో మూడు లక్షలకు పైగా చేపపిల్లలను పెంచవచ్చు. ప్రభుత్వం 2017కు ముందు చేపలు పట్టేందుకు వలలను, అమ్ముకునేందుకు వాహనాలను 75శాతం సబ్సిడీతో అందించింది. తర్వాత ఆ ఊసే లేదు. సహకార సంఘానికి ఉచితంగా చేపపిల్లలతోపాటు చేపల దాణాను, సబ్సిడీపై రుణాలను అందిస్తే మత్స్యకారులకు ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. మండలంలో ఏడు మత్స్యకార సహకారసంఘాల ఉన్నాయి. మండల కేంద్రంలో చేపల మార్కెట్‌ను ఏర్పాటుచేస్తే మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతుంది.

Updated Date - 2023-03-05T23:41:37+05:30 IST