Share News

మత్స్యకారులకు అన్యాయం

ABN , First Publish Date - 2023-11-21T00:59:24+05:30 IST

నేడు మత్స్యకారుల దినోత్సవం. కులవృత్తి చేపల వేట కలగిన సాంప్రదాయ మత్స్యకార కులాలు (అగ్నికుల క్షత్రియ సహకులాలు, బెస్త, జాలారి, వాడబలిజ, పట్టపు, నెయ్యల) సమాజానికి...

మత్స్యకారులకు అన్యాయం

నేడు మత్స్యకారుల దినోత్సవం. కులవృత్తి చేపల వేట కలగిన సాంప్రదాయ మత్స్యకార కులాలు (అగ్నికుల క్షత్రియ సహకులాలు, బెస్త, జాలారి, వాడబలిజ, పట్టపు, నెయ్యల) సమాజానికి కావలసిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మత్స్యవృత్తిని బతికిస్తోన్న ఈ సామాజిక కులాలను, బతుకుదెరువు కొరకు ఈ వృత్తిలోకి ప్రవేశించిన వారిని ప్రభుత్వం ఒకే విధంగా చూస్తోంది. మత్స్యకార భరోసా క్రింద వేట సమయంలో ఏవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ మత్స్యకారుడి కుటుంబానికి చెల్లిస్తామన్న 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను 5 లక్షలతో సరిపెడుతున్నారు. ఈ 5 లక్షలు కూడా కుటుంబ యజమాని చనిపోతే మాత్రమే ఇస్తాం, కుటుంబ సభ్యులు చనిపోతే ఇవ్వమని ప్రభుత్వం మెలిక పెట్టింది. వేట నిషేధ సమయంలో (ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 14 వరకు 61 రోజులు) జీవనభృతి కేవలం తీరప్రాంత (మెరైన్‌) మత్స్యకారులకు ఇస్తున్నారు. మైదాన (ఇన్‌లాండ్‌) ప్రాంతంలో వేట నిషేధం (జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు 61 రోజులు) విధిస్తుండగా వారికి జీవనభృతి ఇవ్వడం లేదు. మత్స్యకార భరోసా (10 వేలు) నగదు తీసుకునేవారు వృద్ధాప్య పింఛన్‌కు అర్హులుకారని చెప్పి వారి పింఛను రద్దుచేస్తున్నారు. ఇదీకాక, మైదాన ప్రాంత మత్స్యకారుల పొట్టకొడుతున్న జీఓఆర్‌టీ నెం. 217ను ప్రభుత్వం తీసుకొచ్చి మత్స్యకారులను వృత్తి నుండి దూరం చేసే కుట్ర చేస్తోంది. మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారి సంక్షేమానికి కృషిచేయాలి.

సైకం రాజశేఖర్‌

Updated Date - 2023-11-21T00:59:28+05:30 IST