Share News

హైకూలు

ABN , First Publish Date - 2023-10-30T01:02:15+05:30 IST

దారినెవరో మడతపెట్టినట్టు మలుపు లైబ్రరీని చేరిన ఏకవాక్య మహాకావ్యం నది కొంగ ఎగిరెళ్లింది నీడ అలల్లో తప్పిపోయింది...

హైకూలు

దారినెవరో

మడతపెట్టినట్టు

మలుపు

లైబ్రరీని చేరిన

ఏకవాక్య మహాకావ్యం

నది

కొంగ ఎగిరెళ్లింది

నీడ

అలల్లో తప్పిపోయింది

గాలివాలులో

ఓడిన గొడుగు

వానకి దోసిలి

నింగి వంతెన మీంచి

నీరవంలోకి నడుస్తూ

సంధ్య

దించేస్కున్న భారాలింకా

బరువై

వృద్ధాశ్రమం

మేస్త్రి వచ్చాడు

అసంపూర్ణ చిత్రం

మళ్లీ ఆరంభం

పచ్చజెండా

రైలు ట్రావెలాగ్లో

మరోవాక్యం మొదలు

అడివంతా

కొమ్మలు కలిపిన

ఉమ్మడి కుటుంబం

తెడ్లు చేసిన గాయాలకు

రాత్రిని పూస్తూ

నది

పట్టాలు పట్టుకుని

వెనక్కి వెళ్తూ

పొగా నీడా

చేపల తొట్టెలా

నింగి

రంగుల పతంగులతో

గోపరాజు రాధాకృష్ణ

బొమ్మ: అక్బర్‌

Updated Date - 2023-10-30T01:02:15+05:30 IST