స్నేహితుల ఊతంతో దివ్యాంగ బాలిక అడుగులు

ABN , First Publish Date - 2023-02-21T22:55:25+05:30 IST

పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగ బాలికకు స్నేహితులు ఊతమై అడుగులు వేయిస్తున్నారు. దీంతో ఆ అమ్మాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.

స్నేహితుల ఊతంతో దివ్యాంగ బాలిక అడుగులు
స్నేహితుల కర్ర ఊతంతో అడుగులు వేస్తున్న దివ్యాంగ బాలిక

తల్లాడ, ఫిబ్రవరి 21: పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగ బాలికకు స్నేహితులు ఊతమై అడుగులు వేయిస్తున్నారు. దీంతో ఆ అమ్మాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మల్లవరానికి చెందిన కోయిల కావ్య పోలియో వల్ల రెండు కాళ్లూ చచ్చుబడి నడవలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో కావ్య నాలుగో తరగతి చదువుతున్నది. ఇంటి వద్దనుంచి పాఠశాలకు కావ్యను తల్లిదండ్రులు పంపించి వెళ్తుంటారు. పాఠశాలలో కావ్య విశ్రాంత సమయంలో మూత్రశాలకు ఇతర అవసరాల కోసం ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లాలంటే కర్రే ఆధారం. కర్రను చెరోవైపు ఇద్దరు స్నేహితులు అడ్డంగా పట్టుకొని ఊతమిస్తే కావ్య కర్ర మధ్యలో పట్టుకొని కాళ్లను కదుపుతూ ముందుకు అడుగులు వేస్తుంది. దివ్యాంగురాలైన కావ్యకు పాఠశాలలో నిత్యం స్నేహితులు అందిస్తున్న ఊతం ఆమె చదువుకు ఎంతో తోడ్పాటుగా నిలిచింది.

Updated Date - 2023-02-21T22:55:30+05:30 IST