క్యాలెండర్
ABN , Publish Date - Dec 31 , 2023 | 03:54 AM
పాత నీటిని పక్కకు నెట్టి కొత్త నీరొచ్చి చేరినట్టు వసంతాన్ని పక్కకు నెట్టి వానాకాలం తిష్ట వేసినట్టు ఆకులన్నీ...
పాత నీటిని పక్కకు నెట్టి
కొత్త నీరొచ్చి చేరినట్టు
వసంతాన్ని పక్కకు నెట్టి
వానాకాలం తిష్ట వేసినట్టు
ఆకులన్నీ రాల్చుకున్న వృక్షం
కొత్త చిగుళ్ళతో కొత్త రూపు
సంతరించుకున్నట్లు..!
పన్నెండు నెలలుగా గోడకు తిష్ట వేసిన
క్యాలెండరును నెట్టివేసి
కొత్త క్యాలెండర్ వచ్చి చేరింది...!
గతం గాయమై వేధించినా
వర్తమానంలోని ఆశలు
భవిష్యత్తుకు బాటలు వేస్తున్నా...!
రంగురంగుల క్యాలెండర్
ఈసారైనా నా జీవితానికి
రంగులద్దుతుందో...
పన్నెండు పేజీలలో ఏదో ఒక పేజీ
జీవితాన్ని మలుపు తిప్పకపోతుందా
అని ఆశతో నిరీక్షిస్తూ..!
మహమ్మద్ హసన్