కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా: ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2023-03-18T22:32:10+05:30 IST

కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం బోల్తా పడటంతో ఆరుగురుకి గాయాలయ్యాయి.

కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా: ఆరుగురికి గాయాలు

పెనుబల్లి, మార్చి 18: కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనం బోల్తా పడటంతో ఆరుగురుకి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఏపీలోని కొవ్వూరు జిల్లా పెరవెల్లి మండలం కానూరు అగ్రహారానికి చెందిన 11 మంది తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెరకు నరికేందుకు కొద్దిరోజుల క్రితం వచ్చారు. పని ముగించుకుని శనివారం స్వగ్రామానికి టాటా ఏస్‌ వాహనంలో బయలుదేరారు. ఈక్రమంలో పెనుబల్లి మండలం టేకుపల్లి వద్దకు రావడం, అప్పుడే వర్షం కురిసి రోడ్డు చిత్తడిగా మారడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న గోవింద్‌, సూరిబాబు, హరిదాసు, పుల్లయ్య, నారాయణ, నాగయ్యలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-03-18T22:32:10+05:30 IST