ఫ్రెషర్స్‌కు విప్రో షాక్‌

ABN , First Publish Date - 2023-02-21T01:45:46+05:30 IST

ఐటీ కంపెనీల్లో పరిస్థితులు విషమిస్తున్నాయి. దీంతో ఏదోలా జీతాల ఖర్చు లు తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో విప్రో కంపెనీ...

ఫ్రెషర్స్‌కు విప్రో షాక్‌

  • సగం జీతానికైతే ఓకే

బెంగళూరు: ఐటీ కంపెనీల్లో పరిస్థితులు విషమిస్తున్నాయి. దీంతో ఏదోలా జీతాల ఖర్చు లు తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో విప్రో కంపెనీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏడాది శిక్షణ తర్వాత సంవత్సరానికి రూ.6.5 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.3.5 లక్షలతో సరిపెట్టుకోమంటోంది. ఈ మేరకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్‌కు ఈ నెల 16న ఈ-మెయిల్స్‌ పంపించింది. ఇందుకు అంగీకరిస్తే సోమవారంలోపు తెలపాలని ఆ ఈ-మెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పదివేలని ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ అంగీకరించినట్టు సమాచారం.

తప్పడం లేదు మరి: వ్యాపార పరిస్థితులు మారినందున, ఇది తప్పడం లేదని విప్రో తెలిపింది. కొత్త ఐటీ ప్రాజెక్టులపై సంతకాలు చేసేందుకు విదేశీ కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు తగ్గించడంతో పాటు ఉన్న ఉద్యోగుల్నీ మరింత సానపడుతున్నాయి. పనితీరు ఏ మాత్రం బాగోకపోయినా వదిలించుకుంటున్నాయి. శిక్షణలో పనితీరు బాగోలేదనే పేరుతో విప్రో ఇటీవలే 600 మందికిపైగా ఫ్రెషర్స్‌ను ఇంటికి పంపింది.

Updated Date - 2023-02-21T01:45:48+05:30 IST