కెనరా బ్యాంక్‌ నుంచి యూపీఐ ఇంటరాపరబుల్‌ డిజిటల్‌ రూపీ యాప్‌

ABN , First Publish Date - 2023-08-22T01:43:10+05:30 IST

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. యూపీఐ ఇంటరాపరబుల్‌ డిజిటల్‌ రూపీ మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదల చేసింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. సెంట్రల్‌ బ్యాంక్‌..

కెనరా బ్యాంక్‌ నుంచి యూపీఐ   ఇంటరాపరబుల్‌ డిజిటల్‌ రూపీ యాప్‌

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. యూపీఐ ఇంటరాపరబుల్‌ డిజిటల్‌ రూపీ మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదల చేసింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రారంభించినట్లు కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు వెల్లడించారు. కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌ (సీబీడీసీ మొబైల్‌ యాప్‌) పేరుతో దీన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ, కమర్షియల్‌ బ్యాంకింగ్‌ విభాగంలో ఈ తరహా సర్వీ్‌సను తీసుకువచ్చిన తొలి బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌ అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు మర్చంట్‌ యూపీఐ క్యూఆర్‌ కోడ్స్‌ను కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌ ద్వారా స్కాన్‌ చేసి డిజిటల్‌ కరెన్సీ రూపంలో చెల్లింపులు చేపట్టవచ్చని బ్యాంక్‌ పేర్కొంది. కాగా ప్రస్తుత యూపీఐ క్యూఆర్‌ కోడ్స్‌ను చెల్లింపుల కోసం మర్చంట్స్‌ యథాతథంగా ఉపయోగించవచ్చని, సీబీడీసీ కోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. డిజిటల్‌ కరెన్సీలో లావాదేవీలు చేపట్టాలనుకునే వినియోగదారుల కోసం ఆండ్రాయిడ్‌, ఐఓఎ్‌సలపై కెనరా బ్యాంక్‌ డిజిటల్‌ రూపీ మొబైల్‌ అప్లికేషన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో డిజిటల్‌ రూపీ యాప్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది.

Updated Date - 2023-08-22T01:43:10+05:30 IST