సంగీతాలో ఉగాది ఆఫర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం
ABN , First Publish Date - 2023-03-19T02:10:22+05:30 IST
తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా సంగీతా మొబైల్స్‌లో ప్రతి మొబైల్స్ కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ చందు రెడ్డి వెల్లడించారు. దక్షిణాదిలోని సంగీతా మొబైల్స్‌కు చెంది న 800 షోరూమ్‌ల్లో...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా సంగీతా మొబైల్స్‌లో ప్రతి మొబైల్స్ కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ చందు రెడ్డి వెల్లడించారు. దక్షిణాదిలోని సంగీతా మొబైల్స్‌కు చెంది న 800 షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఒప్పో ఫ్లిప్ ఫైన్డ్ ఎన్2. సామ్‌సంగ్ ఎస్23, ఏ34, ఏ54, వన్‌ప్ల్‌స 11, 11ఆర్, ఏంఐ 13ప్రో, వివో వీ027 సహా అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్స్.. సంగీతాలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఉగాది ఆఫర్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఒక స్మార్ట్‌వాచ్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే సంగీతాలో రూ.50 వేల స్మార్ట్‌టీవీ కొనుగోలుపై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు చందు రెడ్డి చెప్పారు. సంగీతాలో 10 బ్రాండ్స్‌కు చెందిన ల్యాప్‌టా్‌ప్సతో పాటు ఇన్‌స్టా 360 ఆటోమేటిక్ కెమెరాలు, ఆడియో సన్‌గ్లాసె్‌స, డాష్ కెమెరాలు, మోషన్ సెన్సార్ లెడ్ లైట్ వంటివి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై రాయితీగా డిజిటల్ గోల్డ్‌ను వినియోగదారులు అందుకోవచ్చన్నారు. అంతేకాకుండా మొబైల్ కొనుగోలు చేసిన 30 రోజుల వరకు అన్‌బ్రేకబుల్ వర్తించనుందన్నారు.