Share News

బాండ్‌ మార్కెట్‌ మరింత సరళం

ABN , First Publish Date - 2023-12-11T04:09:31+05:30 IST

దేశంలో బాండ్ల మార్కెట్‌ను మరింత విస్తరించే దిశగా సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘‘ఫాస్ట్‌ ట్రాక్‌’’...

బాండ్‌ మార్కెట్‌ మరింత సరళం

న్యూఢిల్లీ: దేశంలో బాండ్ల మార్కెట్‌ను మరింత విస్తరించే దిశగా సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘‘ఫాస్ట్‌ ట్రాక్‌’’ కాన్సె్‌ప్టను అమలుపరుస్తోంది. ఇప్పటివరకు ఒక్కో బాండ్‌ కనీస ముఖవిలువ రూ.1 లక్ష ఉండగా దాన్ని రూ.10 వేలకు తగ్గించాలని సెబీ ప్రతిపాదిస్తోంది. దీని వల్ల వ్యాపార సరళీకరణ మరింతగా విస్తరిస్తుంది. అలాగే ఫాస్ట్‌ట్రాక్‌ పబ్లిక్‌ ఇష్యూల్లో డెట్‌ సెక్యూరిటీల లిస్టింగ్‌కు గడువును టి+3గా నిర్ణయించాలని కూడా సెబీ ప్రతిపాదిస్తోంది. వీటన్నింటిపై ఈ నెల 30 లోగా అభిప్రాయాలు తెలియచేయాలని ఆసక్తి గల వర్గాలను సెబీ ఆహ్వానించింది.

Updated Date - 2023-12-11T04:09:34+05:30 IST