హోండా వాహనాలకు పదేళ్ల వారెంటీ
ABN , First Publish Date - 2023-06-08T02:08:23+05:30 IST
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట ర్స్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) తమ కస్టమర్ల కోసం ఒక వినూత్నమైన వారెంటీ స్కీమ్ ప్రకటించింది...
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట ర్స్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) తమ కస్టమర్ల కోసం ఒక వినూత్నమైన వారెంటీ స్కీమ్ ప్రకటించింది. 250 సీసీ వరకు వాహనాలన్నింటికీ ఈ స్కీమ్ కింద 10 సంవత్సరాల వరకు వారెంటీ కల్పిస్తారు. వాహనం కొన్న 91 రోజుల నుంచి తొమ్మిదో సంవత్సరం వరకు ఎప్పుడైనా ఈ ఎక్స్‌టెండెడ్ వారెంటీ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ 10 సంవత్సరాల సమగ్ర వారెంటీ ఇవ్వడమే కాకుండా వాహన యజమాని మారినట్టయితే వారికి కూడా దాన్ని బదిలీ చేసుకునే అవకాశం ఉంది.