టెక్‌ వ్యూ కీలక మద్దతు 19500 చేరువలో...

ABN , First Publish Date - 2023-10-03T03:27:58+05:30 IST

నిఫ్టీ గత వారం కరెక్షన్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తూ 19500 వరకు దిగివచ్చి శుక్రవారం ఇదే స్థాయిలో మైనర్‌ రికవరీ సాధించింది. అంటే 19500 వద్ద మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే వారం మొత్తానికి...

టెక్‌ వ్యూ  కీలక మద్దతు 19500 చేరువలో...

టెక్‌ వ్యూ

కీలక మద్దతు 19500 చేరువలో...

నిఫ్టీ గత వారం కరెక్షన్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తూ 19500 వరకు దిగివచ్చి శుక్రవారం ఇదే స్థాయిలో మైనర్‌ రికవరీ సాధించింది. అంటే 19500 వద్ద మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే వారం మొత్తానికి 35 పాయింట్ల నష్టంతో వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల కు మధ్యన క్లోజ్‌ కావడం అనిశ్చిత ధోరణిని సూచిస్తోంది. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. సానుకూలత కోసం ప్రధాన మద్దతు స్థాయి కూడా అయిన 19500 వద్ద కన్సాలిడేట్‌ కావాలి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు లాభాలతో ముగిసినా అవి కూడా రెండు వారాల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయిల కన్నా దిగువనే ఉన్నాయి. గత 7 సెషన్లుగా సాగుతున్న డౌన్‌ట్రెండ్‌లో 700 పాయింట్ల వరకు నిఫ్టీ కోల్పోయింది. టెక్నికల్‌గా దీన్ని సాధారణ కరెక్షన్‌ ట్రెండ్‌గానే భావించాలి. విఫలమైనట్టయితే రెండో రౌండ్‌ కరెక్షన్‌లో ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. మానసిక అవధి 20000 వద్ద బలమైన రియాక్షన్‌ ఏర్పడినందు వల్ల అది స్వల్పకాలిక, మధ్యకాలిక మద్దతు స్థాయిగా మారింది.

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూలత కోసం నిఫ్టీ 19500 కన్నా పైన పటిష్ఠంగా కన్సాలిడేట్‌ కావాలి. మరో నిరో ధం 19800. ఆ పైన మాత్ర మే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. ప్రధాన మానసిక అవధి 20050.

బేరిష్‌ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శించినా మరింత డౌన్‌ట్రెండ్‌ను నివారించుకోవడానికి 19500 వద్ద రికవరీ సాధించి తీరాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 19200 (ఆగస్టు 31న ఏర్పడిన బాటమ్‌). సానుకూలత కోసం ఈ స్వల్పకాలిక, మధ్యకాలిక మద్దతు స్థాయిలో కన్సాలిడేట్‌ అయి తీరాలి.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారంలో 300 పాయింట్ల నష్టంతో ముగిసింది. రికవరీ బాట పడితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 44700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 45100. బలహీనపడి మద్దతు స్థాయి 43800 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 43500.

పాటర్న్‌ : నిఫ్టీ ‘‘ఏటవాలుగా దిగువకు ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగువనే ఉండడం బలహీనత సంకేతం. సానుకూలత కోసం 19800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకుని తీరాలి. 19500 వద్ద డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. నిఫ్టీ ప్రస్తుతం 20, 50 డిఎంఏల వద్ద ఉంది. ఇక్కడ ్జకూడా నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 19710, 19760

మద్దతు : 19560, 19500

వి. సుందర్‌ రాజా

Updated Date - 2023-10-03T03:27:58+05:30 IST