టీసీఎస్‌ రాజన్నకు జీవితకాల సాఫల్య పురస్కారం

ABN , First Publish Date - 2023-03-26T04:21:21+05:30 IST

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రీజియన్‌ హెడ్‌, కమ్యూనికేషన్స్‌, టెక్నాలజీ బిజినెస్‌ గ్రూప్‌ అదిపతి వీ రాజన్నకు హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌...

టీసీఎస్‌ రాజన్నకు జీవితకాల సాఫల్య పురస్కారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రీజియన్‌ హెడ్‌, కమ్యూనికేషన్స్‌, టెక్నాలజీ బిజినెస్‌ గ్రూప్‌ అదిపతి వీ రాజన్నకు హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) జీవితకాల సాఫల్య (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌) పురస్కారాన్ని అందించింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాజన్నకు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. తెలంగాణలో ఐటీ రంగం పురోభివృద్ధికి తోడ్పడి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేసినందుకు గాను రాజన్నకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు హెచ్‌ఎంఏ తెలిపింది.

Updated Date - 2023-03-26T04:21:21+05:30 IST