20,000 పైన నిలదొక్కుకోవడం కీలకం

ABN , First Publish Date - 2023-09-18T04:04:35+05:30 IST

నిఫ్టీ గత వారం మానసిక అవధి 20,000 దాటి చివరికి ముందు వారంతో పోల్చితే 370 పాయింట్ల లాభంతో 20,200 వద్ద ముగిసింది. 20,000 పాయింట్లను దాటిన కారణంగా పుల్‌బ్యాక్‌ ఏర్పడే అవకాశం...

20,000 పైన నిలదొక్కుకోవడం కీలకం

టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం మానసిక అవధి 20,000 దాటి చివరికి ముందు వారంతో పోల్చితే 370 పాయింట్ల లాభంతో 20,200 వద్ద ముగిసింది. 20,000 పాయింట్లను దాటిన కారణంగా పుల్‌బ్యాక్‌ ఏర్పడే అవకాశం ఉన్నందు వల్ల గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తత అవశ్యం. మరోసారి 20,000 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి. గత 11 రోజులుగా నిరంతరాయంగా సాగిన ర్యాలీలో నిఫ్టీ 19,200 స్థాయి నుంచి 2,000 పాయింట్ల వరకు లాభపడి ప్రస్తుతం కొత్త గరిష్ఠ స్థాయిల్లో నిలిచి ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌ ఏర్పడవచ్చు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు ఇప్పటికే బలమైన రియాక్షన్‌ సాధించినందు వల్ల స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ ఏర్పడినట్టు భావించవచ్చు. గత శుక్రవారం అమెరికన్‌ స్టాక్‌మార్కెట్లో బలమైన కరెక్షన్‌ ఏర్పడినందు వల్ల మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: రియాక్షన్‌ అనంతరం రికవరీ ఏర్పడినట్టయితే తదుపరి నిరోధం 20,200 కన్నా పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. తదుపరి మానసిక అవధి 20,500.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా కరెక్షన్‌ నివారించుకోవాలంటే 20,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అంతకన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 19,700, 19,500.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం 1100 పాయింట్ల లాభంతో 46,000 కన్నా పైన క్లోజయింది. ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయి 46,300 వద్ద నిలిచి ఉంది. ప్రధాన నిరోధం 46,600. ఈ వారంలో రియాక్షన్‌ అనంతరం రికవరీ సాధించినా మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. బలహీనపడి ప్రధాన మద్దతు స్థాయి 45,700 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

పాటర్న్‌: నిఫ్టీ భద్రత కోసం 20,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకుని తీరాలి. ఆర్‌ఎ్‌సఐ, ఆర్‌ఓసి సూచీల ప్రకారం మార్కెట్‌ స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిలో ఉన్నందు వల్ల అప్రమత్తంగా ఉండాలి. గరిష్ఠ స్థాయిల్లో స్వల్పకాలిక సద్దుబాటు కరెక్షన్‌ లేదా కన్సాలిడేషన్‌ ఉండవచ్చు.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 20,155, 20,200

మద్దతు : 20,180, 20,000

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

వి. సుందర్‌ రాజా

Updated Date - 2023-09-18T04:04:35+05:30 IST