జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై దివాలా చర్యలకు స్టే

ABN , First Publish Date - 2023-02-25T04:35:41+05:30 IST

జీ ఎంట్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజె్‌సకు ఎన్‌సీఎల్‌ఏటీలో భారీ ఉపశమనం లభించింది. కంపెనీపై గత వారం ప్రారంభమైన దివాలా చర్యలను ఎన్‌సీఎల్‌ఏటీ నిలిపివేసింది...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై దివాలా చర్యలకు స్టే

న్యూఢిల్లీ: జీ ఎంట్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజె్‌సకు ఎన్‌సీఎల్‌ఏటీలో భారీ ఉపశమనం లభించింది. కంపెనీపై గత వారం ప్రారంభమైన దివాలా చర్యలను ఎన్‌సీఎల్‌ఏటీ నిలిపివేసింది. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పునీత్‌ గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు, ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. విచారణ తేదీని మార్చి 29కి వాయిగా వేస్తూ ఈ లోగా బుధవారం న్యాయాధికారి జారీ చేసిన ఉత్తర్వులు నిలిపివేత దశలో ఉంటాయని ప్రకటించింది.

Updated Date - 2023-02-25T04:35:42+05:30 IST