సిగ్నిటీ టెక్నాలజీ్‌సలోకి శ్రీనివాస్ కందుల!
ABN , First Publish Date - 2023-03-21T02:10:01+05:30 IST
హైదరాబాద్‌కు చెందిన సిగ్నిటీ టెక్నాలజీస్ బోర్డులోకి గతంలో క్యాప్‌జెమినీ ఇండియా చైర్మన్‌గా పని చేసిన కందుల శ్రీనివాస్ రానున్నారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన సిగ్నిటీ టెక్నాలజీస్ బోర్డులోకి గతంలో క్యాప్‌జెమినీ ఇండియా చైర్మన్‌గా పని చేసిన కందుల శ్రీనివాస్ రానున్నారు. ఆయన్ను డైరెక్టర్‌గా నియమించే అంశంపై ఈనెల 27న సిగ్నిటీ డైరెక్టర్ల బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం శ్రీనివాస్ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవల్‌పమెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్ ఇండియాకు చైర్మన్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేయడానికి ముందు అదే కంపెనీలో సీఈఓగా, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. గతం లో ఐగేట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర కంపెనీల్లో కూడా పనిచేశారు.