హైదరాబాద్‌లో సొడెక్సో మాస్టర్ కిచెన్
ABN , First Publish Date - 2023-09-15T03:48:38+05:30 IST
సొడెక్సో ఇండియా ఆఫీస్ ఫుడ్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ సమీపంలో ఆఫ్‌సైట్ మాస్టర్ కిచెన్ ఏర్పాటు చేసింది...
హైదరాబాద్: సొడెక్సో ఇండియా ఆఫీస్ ఫుడ్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ సమీపంలో ఆఫ్‌సైట్ మాస్టర్ కిచెన్ ఏర్పాటు చేసింది. ఈ కిచెన్ ద్వారా వివిధ కంపెనీలకు చెందిన 25,000 మంది ఉద్యోగులకు రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అందించవచ్చు. తమ మొత్తం ఆదాయంలో 10 శాతం ఈ విభాగం ద్వారా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సొడెక్సో ఇండి యా ఎండీ సంబిత్ సాహ ఒక ప్రకటనలో తెలిపారు. కిచెన్ సదుపాయం లేని కంపెనీల ఉద్యోగులకు శుచి, శుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం తమ లక్ష్యమన్నారు. ఈ మాస్టర్ కిచెన్ వ్యవస్థను త్వరలో బెంగళూరు,పుణె, ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకూ విస్తారించాలని కంపెనీ భావిస్తోంది.