హైదరాబాద్‌లో స్కంద ఏరోస్పేస్‌ గేర్ల తయారీ యూనిట్‌

ABN , First Publish Date - 2023-09-20T02:07:03+05:30 IST

స్కంద ఏరోస్పేస్‌ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్‌లో హై ప్రెసిషన్‌ గేర్లు, గేర్‌ బాక్సుల తయారీకి యూనిట్‌ను ప్రారంభించింది...

హైదరాబాద్‌లో స్కంద ఏరోస్పేస్‌ గేర్ల తయారీ యూనిట్‌

మూడేళ్లలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్కంద ఏరోస్పేస్‌ టెక్నాలజీ కంపెనీ హైదరాబాద్‌లో హై ప్రెసిషన్‌ గేర్లు, గేర్‌ బాక్సుల తయారీకి యూనిట్‌ను ప్రారంభించింది. విమానాలు, హెలికాప్టర్ల కోసం ఇక్కడ గేర్లు, గేర్‌ బాక్సులు తయారు చేయనున్నట్లు రఘు వంశీ మెషిన్‌ టూల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంశీ వికాస్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన స్కంద ఏరోస్పే్‌సను అమెరికాకు చెందిన రేవ్‌ గేర్స్‌ ఎల్‌ఎల్‌సీతో కలిసి రఘువంశీ మెషిన్‌ టూల్స్‌ ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ ప్రారంభించడానికి మొదటి దశలో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. వచ్చే రెండు మూడేళ్లలో మరో రూ.150 కోట్లు వెచ్చించనున్నామని వంశీ చెప్పారు. ప్రస్తుతం 150 మంది నిపుణులు పని చేస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దీన్ని 1,000 మందికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరహా యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కొత్త యూనిట్‌ ద్వారా హైదరాబాద్‌ ఏరోస్పేస్‌ తయారీ రంగం మరింత బలపడుతుందని తెలంగాణ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అన్నారు.

Updated Date - 2023-09-20T02:07:03+05:30 IST