స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్
ABN , Publish Date - Dec 14 , 2023 | 04:53 AM
స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప లాభాలతో ముగిసింది. రోజంతా ఆటుపోట్లకు లోనైన సెన్సెక్స్ చివరికి 33.57 పాయింట్ల లాభంతో 69,584.60 వద్ద, నిఫ్టీ 19.95 పాయింట్ల లాభంతో...
ముంబై: స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప లాభాలతో ముగిసింది. రోజంతా ఆటుపోట్లకు లోనైన సెన్సెక్స్ చివరికి 33.57 పాయింట్ల లాభంతో 69,584.60 వద్ద, నిఫ్టీ 19.95 పాయింట్ల లాభంతో 20,926.35 వద్ద ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ ఒక దశలో 450.47 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే చివరి గంటలో ఎల్ అండ్ టీ, రిలయన్స్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాల నుంచి బయట పడ్డాయి.