సెలెక్ట్ మొబైల్స్ దీపావళి ధమాకా ఆఫర్లు
ABN , First Publish Date - 2023-11-10T02:11:36+05:30 IST
మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్.. దీపావళి సందర్భంగా గ్రేట్ ఫెస్టివల్ డేస్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు మాట్లాడుతూ..
హైదరాబాద్: మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్.. దీపావళి సందర్భంగా గ్రేట్ ఫెస్టివల్ డేస్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు మాట్లాడుతూ.. దీపావళి ధమాకా ఆఫర్స్‌లో భాగంగా ప్రత్యేకంగా స్కాన్ అండ్ విన్ కాన్సె ప్ట్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కాన్సెప్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌పై 25 శాతం డిస్కౌంట్, ఎల్‌ఈడీ టీవీ రూ.6,999కి, బై వన్ గెట్ వన్ కాంబో ఆఫర్, యాక్సెసరీ్‌సపై అత్యుత్తమ సేవింగ్స్ లాంటి ఆఫర్లు, డీల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా దీపావళిని పురస్కరించుకుని సరికొత్త, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేకమైన డీల్స్, బహుమతులతో పాటు ఎల్‌ఈడీ టీవీ ధరలో క్యూఎల్‌ఈడీ టీవీని పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు గురు పేర్కొన్నారు. అలాగే హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఈజీ ఈఎంఐపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఐసీఐసీఐ ఫైనాన్స్‌పై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్, బజాజ్ ఫిన్‌సర్వ్‌పై రూ.9,000 వరకు క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 5 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ దీపావళి ప్రత్యేక ఆఫర్లు అన్ని సెలెక్ట్ మొబైల్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని గురు వెల్లడించారు.