జోయాలుక్కాస్‌లో సీతా కళ్యాణం బ్రైడల్ కలెక్షన్
ABN , First Publish Date - 2023-06-25T02:58:40+05:30 IST
ప్రపంచ ఫేవరేట్ జువెలర్ జోయాలుక్కాస్.. ‘సీతా కళ్యాణం’ పేరుతో ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్‌ను తీసుకువచ్చింది. దివ్యమైన ప్రేమకు గుర్తుగా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు తెలిపింది...
హైదరాబాద్: ప్రపంచ ఫేవరేట్ జువెలర్ జోయాలుక్కాస్.. ‘సీతా కళ్యాణం’ పేరుతో ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్‌ను తీసుకువచ్చింది. దివ్యమైన ప్రేమకు గుర్తుగా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ బ్రైడల్ కలెక్షన్‌ను జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ విడుదల చేశారు. సాంప్రదాయం, ట్రెండ్స్‌ను సమతూకం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జోయాలుక్కాస్ పేర్కొంది. రామాయణ మహా కావ్యంలో రాముడు, సీత మధ్య ఉన్న దివ్యమైన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సీతా కళ్యాణం బ్రైడల్ కలెక్షన్‌ను సాంప్రదాయిక టెంపుల్ జువెలరీతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపింది. ఈ కలెక్షన్ తయారీలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఆభరణాల తయారీదారులు వీటిని రూపొందించారని జోయాలుక్కాస్ వెల్లడించింది. భారతీయ సాంప్రదాయ విలువలకు కట్టుబడి నేటి తరం కోసం ఈ ప్రత్యేకమైన కలెక్షన్‌ను తీర్చిదిద్దినట్లు జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జోయాలుక్కాస్ షోరూమ్ ల్లో సీతా కళ్యాణం బ్రైడల్ కలెక్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.