ఈ వారం మరింత ముందుకే

ABN , First Publish Date - 2023-09-04T02:04:17+05:30 IST

నిఫ్టీ ఐదు వారాల వరుస నష్టాలకు ముగింపు పలికి గతవారం లాభాల్లో పయనించింది...

ఈ వారం మరింత ముందుకే

నిఫ్టీ ఐదు వారాల వరుస నష్టాలకు ముగింపు పలికి గతవారం లాభాల్లో పయనించింది. ఫ్రంట్‌లైన్‌ స్టాక్స్‌ అన్నిటికి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ మళ్లీ 19,400 స్థాయిని అధిగమించింది. ఇటీవల బలహీనపడిన బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ (బీఎ్‌ఫఎ్‌సఐ) కంపెనీల షేర్లూ ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ వారం తొలి రెండు రోజులూ మార్కెట్‌కు అత్యంత కీలకం. నిఫ్టీ 19,500-19,600 స్థాయిని బ్రేక్‌ చేస్తే, బుల్స్‌ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంది. లేదంటే కొన్ని సవాళ్లు తప్పవు. ఏదేమైనా 19,300-19,250ని నిఫ్టీకి కీలక మద్దతుగా పరిగణించాలి.

ఈ వారం స్టాక్‌ రికమండేషన్లు :

1. లేటెంట్‌వ్యూ

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నిద్రాణంగా ఉన్న ఈ స్ర్కిప్‌ ప్రస్తుతం చురుగ్గా ట్రేడవుతోంది. ట్రేడయ్యే షేర్ల పరిమాణమూ గణనీయంగా పెరిగింది. దీంతో గత వారం ఈ స్ర్కిప్‌ ఎన్‌ఎ్‌సఈలో రూ.455.15 వద్ద ముగిసింది. ఈ కౌంటర్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే, ఈ స్టాక్‌ మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.436.50 స్టాప్‌ లాస్‌తో రూ.490 లక్ష్యంగా ట్రేడర్లు ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు.

2. టాటా పవర్‌

నిన్న మొన్నటి వరకు కన్సాలిడేషన్‌ ఫేజ్‌లో ఉన్న టాటా పవర్‌ షేర్లు ప్రస్తుతం బుల్లి్‌షగా మారాయి. డెయిలీ టైమ్‌ ఫ్రేమ్‌ చార్ట్‌ ప్రకారర చూసినా ప్రస్తుతం ఈ షేర్లలో బుల్లిష్‌ ఫ్లాగ్‌ ట్రెండ్‌ కనిపిస్తోంది. టెక్నికల్‌గానూ ఈ కౌంటర్‌లో అన్ని సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. ఎన్‌ఎ్‌సఈలో గత వారం టాటా పవర్‌ షేర్లు రూ.255.35 వద్ద ముగిశాయి. రూ.270 స్వల్పకాలిక టార్గెట్‌తో ట్రేడర్లు ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.246ను స్ట్రిక్ట్‌ స్టాప్‌ లాస్‌గా పెట్టుకోవాలి.

- సమీత్‌ చవాన్‌, ఛీఫ్‌ ఎనలిస్ట్‌, టెక్నికల్‌,

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

Updated Date - 2023-09-04T02:04:23+05:30 IST