బ్యాంకింగ్‌, ఇంధన షేర్లలో అమ్మకాలు

ABN , First Publish Date - 2023-02-21T01:44:03+05:30 IST

ముంబై: ధరలు, వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. స్టాక్‌ మదుపరులు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇంధన రంగ షేర్లలో...

బ్యాంకింగ్‌, ఇంధన షేర్లలో అమ్మకాలు

సెన్సెక్స్‌ 311 పాయింట్లు పతనం

ముంబై: ధరలు, వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలు చవిచూశాయి. స్టాక్‌ మదుపరులు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇంధన రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో సెన్సెక్స్‌, నిఫ్టీ అర శాతానికి పైగా తగ్గాయి. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 311.03 పాయింట్ల నష్టంతో 60,691.54 వద ్దకు జారుకోగా.. నిఫ్టీ 99.60 పాయింట్లు కోల్పోయి 17,844.60 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 12 లాభపడగా.. మిగతా 18 క్షీణించాయి.

  • ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 10 పైసలు పెరిగి రూ.82.72 వద్ద ముగిసింది.

  • యాడ్‌ ఏజెన్సీ ‘క్రెయాన్స్‌ అడ్వర్టైజింగ్‌ లిమిటెడ్‌’.. ఐపీఓకు వచ్చేందుకు ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌కు ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన 64.30 లక్షల ఈక్విటీ షేర్లను బుక్‌ బిల్డింగ్‌ పద్ధతిలో విక్రయించాలనుకుంటోంది. తద్వారా రూ.15.28 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోంది.

11%తగ్గిన ఎఫ్‌పీఐ పెట్టుబడుల విలువ : గత ఏడాది చివరినాటికి భారత ఈక్విటీల్లోని విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎ్‌ఫపీఐ) విలువ 58,400 కోట్ల డాలర్లకు పరిమితమైంది. 2021 డిసెంబరు చివరినాటికి నమోదైన 65,400 కోట్ల డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే 11 శాతం తగ్గినట్లు మార్నింగ్‌ స్టార్‌ నివేదిక వెల్లడించింది. గత ఏడాది భారత స్టాక్‌ మార్కెట్ల రిటర్నుల రేటు తగ్గడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం ఇందుకు కారణమని రిపోర్టు పేర్కొంది.

స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఎన్‌ఎండీసీ స్టీల్‌ లిస్టింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌ఎండీసీ స్టీల్‌ షేర్లు.. బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈతో పాటు కలకత్తా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదయ్యాయి. బీఎ్‌సఈలో రూ.30.25 వద్ద నమోదైన షేర్‌ చివరకు 4.96 శాతం పెరిగి రూ.31.75 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో రూ.30.25 వద్ద నమోదై 4.95 శాతంతో క్లోజైంది. బీఎ్‌సఈలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.9,304.67 కోట్లు ఉంది. బీఎ్‌సఈలో జరిగిన లిస్టింగ్‌ కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్‌ దేవ్‌ పాల్గొన్నారని కంపెనీ వెల్లడించింది. ఎన్‌ఎండీసీ స్టీల్‌ను ఎన్‌ఎండీసీ సొంత అనుబంధ కంపెనీగా 2015లో ఏర్పాటు చేశారు. ఇటీవల దీన్ని ఎన్‌ఎండీసీ నుంచి విడదీసి వేరు కంపెనీగా ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-02-21T01:44:04+05:30 IST