ప్రభుత్వ ఖాతాలోకి సహారా-సెబీ రిఫండ్ నిధులు!
ABN , First Publish Date - 2023-11-21T01:29:56+05:30 IST
సహారా-సెబీ రిఫండ్ ఫండ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. రూ.25,000 కోట్ల వరకు ఉన్న ఈ ఫండ్ నుంచి ఇప్పటి వరకు రూ.138 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి...

న్యూఢిల్లీ: సహారా-సెబీ రిఫండ్ ఫండ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. రూ.25,000 కోట్ల వరకు ఉన్న ఈ ఫండ్ నుంచి ఇప్పటి వరకు రూ.138 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా క్లెయిమ్స్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ నిధులను భారత సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) ఖాతాలో జమ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు న్యాయపరంగా ఎదురయ్యే చిక్కుల గురించి నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రెండు గ్రూప్ కంపెనీల ద్వారా అక్రమంగా సమీకరించిన దాదాపు రూ.20,000 నిధులను ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ చేయాలని సుప్రీంకోర్టు 2012 లో సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఇందుకోసం సహారా-సెబీ రిఫండ్ పేరుతో ప్రత్యేక ఖాతా ఓపెన్ చేయాలని కోరింది.