ఎస్‌బీఐ లైఫ్‌ చేతికి సహారా ఇండియా లైఫ్‌

ABN , First Publish Date - 2023-06-03T01:37:42+05:30 IST

సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌ఐసీ) కథ ముగుస్తోంది.

ఎస్‌బీఐ లైఫ్‌ చేతికి సహారా ఇండియా లైఫ్‌

ఆదేశాలు జారీ చేసిన ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: సహారా ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌ఐసీ) కథ ముగుస్తోంది. ఈ సంస్థకు చెందిన ఆస్తులను, దాదాపు రెండు లక్షల పాలసీలను వెంటనే టేకోవర్‌ చేయాలని ఎస్‌బీఐ లైఫ్‌ను భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. ఎస్‌ఐఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండడంతో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. శుక్రవారం జరిగిన ఐఆర్‌డీఏఐ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది సరికాదు: ఎస్‌ఐఎల్‌ఐసీ

కాగా ఐఆర్‌డీఏఐ తీసుకున్న చర్యలను ఎస్‌ఐఎల్‌ఐసీ పరోక్షంగా విమర్శించింది. తమ కంపెనీని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కి అప్పగిస్తూ 2017లో ఐఆర్‌డీఏఐ జారీ చేసిన ఉత్తర్వులను గుర్తు చేసింది. ఈ కేసు ఇప్పటికీ స్పెషల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌ఏటీ)లో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ నెల 6న ఎస్‌ఏటీలో ఈ కేసు విచారణకు వస్తున్న విషయాన్నీ గుర్తు చేసింది. ఈ విషయం తేలకుండానే ఐఆర్‌డీఏఐ తమ కంపెనీని ఎస్‌బీఐ లైఫ్‌ టేకోవర్‌ చేయాలని ఎలా ఆదేశిస్తుందని ఎస్‌ఐఎల్‌ఐసీ ప్రశ్నించింది.

Updated Date - 2023-06-03T01:37:42+05:30 IST