రీజెన్సీ సిరామిక్స్‌లో మళ్లీ ఉత్పత్తి

ABN , First Publish Date - 2023-09-22T01:22:25+05:30 IST

రీజెన్సీ సిరామిక్స్‌ లిమిటెడ్‌ మళ్లీ ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి అడుగు పెట్టింది. తయారీ యూనిట్లపై దాదాపు రూ.70 కోట్ల పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించిన...

రీజెన్సీ సిరామిక్స్‌లో మళ్లీ ఉత్పత్తి

  • ముందుగా చెన్నై మార్కెట్లోకి అడుగు

  • రూ.70 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రీజెన్సీ సిరామిక్స్‌ లిమిటెడ్‌ మళ్లీ ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి అడుగు పెట్టింది. తయారీ యూనిట్లపై దాదాపు రూ.70 కోట్ల పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ ముందుగా చెన్నై మార్కెట్లోకి ప్రవేశించింది. మార్కెటింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించామని.. గ్లేజ్డ్‌ వెర్టిఫైడ్‌ టైల్స్‌ను చెన్నైలోని డీలర్లకు సరఫరా చేశామని రీజెన్సీ డైరెక్టర్‌, సీఎ్‌ఫఓ సత్యేంద్ర ప్రసాద్‌ తెలిపారు. కాంట్రాక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఒప్పందాల ద్వారా వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు చెప్పారు. 2023 చివరి నాటికి మొత్తం నాలుగు ప్రొడక్షన్‌ లైన్స్‌లో కంపెనీ ఉత్పత్తిని చేపట్టనుంది. మొదటి లైన్‌ రోజుకు 7,000 చదరపు మీటర్ల టైల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. దీన్ని 25,000 చదరపు మీటర్లకు పెంచనున్నారు. వెర్టిఫైడ్‌ టైల్స్‌, డబుల్‌ చార్జ్‌డ్‌ టైల్స్‌, వాల్‌ టైల్స్‌, ఎక్స్‌టీరియర్‌ టైల్స్‌ మొదలైన టైల్స్‌ను తయారు చేయనుంది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించేందుకు మూడంచెల వ్యూహాన్ని కంపెనీ అనుసరించనుంది. డీలర్లను నియమించుకోవటంతో పాటు ప్రధాన నగరాల్లో షోరూమ్‌లు ఏర్పాటు చేయనుంది. ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని యానాంలో కంపెనీ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Updated Date - 2023-09-22T01:22:25+05:30 IST