ముంచిన లాభాల స్వీకరణ

ABN , First Publish Date - 2023-09-22T00:41:17+05:30 IST

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ ఈక్విటీ సూచీలు గురువారంనాడు కూడా భారీగా నష్టపోయాయి. బ్యాం కింగ్‌, ఆటో, ఫైనాన్షియల్‌ కంపెనీల కౌంటర్లలో...

ముంచిన లాభాల స్వీకరణ

సెన్సెక్స్‌ 570 పాయింట్లు పతనం

ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల కారణంగా దేశీయ ఈక్విటీ సూచీలు గురువారంనాడు కూడా భారీగా నష్టపోయాయి. బ్యాం కింగ్‌, ఆటో, ఫైనాన్షియల్‌ కంపెనీల కౌంటర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్‌ 570.60 పాయింట్లు నష్టపోయి 66,230.24 వద్ద ముగియగా.. నిఫ్టీ 159.05 పాయింట్లు నష్టపోయి 19,742.35 వద్ద క్లోజైంది.

  • గురువారం మార్కెట్లో లిస్ట్‌ అయిన ఈఎంఎస్‌ షేరు ఇష్యూ ధర రూ.211తో పోల్చితే 33.43ు ప్రీమియంతో రూ.281.55 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 37.84ు లాభపడి రూ.290.85ని తాకినప్పటికీ చివరికి 32.58ు లాభంతో రూ.279.75 వద్ద ముగిసింది.

  • చెన్నైకి చెందిన ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ అప్‌డేటర్‌ సర్వీసెస్‌ ఇష్యూ ధర శ్రేణిని రూ.280-300గా ప్రకటించింది. ఈ ఇష్యూ వచ్చే సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తుంది.

Updated Date - 2023-09-22T00:41:17+05:30 IST