మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు ర్యాండ్‌ప్యూర్ బంగారం
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:42 AM
ప్రపంచంలోని ప్రముఖ బంగారం, వెండి రిఫైనరీ అయిన ‘ర్యాండ్ రిఫైనరీ’ నుంచి తొలి బంగారం షిప్‌మెంట్‌ను అందుకున్నట్లు జువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వెల్లడించింది...
హైదరాబాద్: ప్రపంచంలోని ప్రముఖ బంగారం, వెండి రిఫైనరీ అయిన ‘ర్యాండ్ రిఫైనరీ’ నుంచి తొలి బంగారం షిప్‌మెంట్‌ను అందుకున్నట్లు జువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వెల్లడించింది. ర్యాండ్‌ప్యూర్ పేరుతో కూడిన ఈ బంగారాన్ని ర్యాండ్ రిఫైనరీ సీఈఓ ప్రవీణ్ బైజ్‌నాథ్, సీఎ్‌ఫఓ డీన్ సుబ్రమణియన్ నుంచి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) షామ్‌లాల్ అహమ్మద్ అందుకున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్‌బీఎంఏ) ద్వారా ర్యాండ్ రిఫైనరీ ప్రత్యేకమైన హోదాను కలిగి ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ర్యాండ్ రిఫైనరీ.. ప్రత్యేకంగా పొందిన గనుల నుంచి వెలికితీసిన ముడి సరుకులను ప్రాసెస్ చేసి డెడికేటెడ్ ఉత్పత్తి లైన్ ద్వారా ర్యాండ్‌ప్యూర్ పేరుతో బంగారాన్ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు సర్టిఫికెట్ ఆఫ్ అష్యూరెన్స్ పేరుతో బంగారానికి సంబంధించిన ముడి సరుకులు, ఉత్పత్తి సమయం వంటి అన్ని వివరాలను అందిస్తోంది. సస్టెయినబులిటీ, రెస్పాన్సిబుల్ వ్యాపార పద్ధతులకు అనుగుణంగా మలబార్ గోల్డ్ కార్యకలాపాలు సాగిస్తోందని, అందుకనుగుణంగానే ర్యాండ్ రిఫైనరీ నుంచి బంగారాన్ని ప్రొక్యూర్ చేస్తున్నట్లు మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ తెలిపారు.