‘అపోలో’లో ఫైజర్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం

ABN , First Publish Date - 2023-05-27T04:21:05+05:30 IST

పెద్దల్లో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో ఫైజర్‌..

‘అపోలో’లో ఫైజర్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పెద్దల్లో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లో ఫైజర్‌.. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఫైజర్‌ డైరెక్టర్‌ (మెడికల్‌ అఫైర్స్‌, వ్యాక్సిన్స్‌) సంతోష్‌ తర్‌ తెలిపారు. వ్యాక్సిన్‌-ప్రివెంటబుల్‌ డిసీజెస్‌ (వీపీడీ) ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేయడంపై ఈ ఎక్సలెన్స్‌ కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తుంది. హెపటైటిస్‌ ఏ, బీ, న్యూమోకోకల్‌, హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ వంటి వాటిని వ్యాక్సిన్ల ద్వారా అరికట్టవచ్చని అపోలో హాస్పిటల్స్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ జే శ్రీకాంత్‌ తెలిపారు.

Updated Date - 2023-05-27T04:21:05+05:30 IST