కో-వర్కింగ్ విభాగంలోకి నూజివీడు సీడ్స్
ABN , First Publish Date - 2023-06-07T02:54:57+05:30 IST
నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఎల్) కో-వర్కింగ్ స్పేస్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు కో-వర్కింగ్ ఆపరేటర్ ‘ఆఫీ్‌స’తో చేతులు కలిపింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఎల్) కో-వర్కింగ్ స్పేస్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకు కో-వర్కింగ్ ఆపరేటర్ ‘ఆఫీ్‌స’తో చేతులు కలిపింది. ఒప్పందం ప్రకారం హైదరాబాద్, బెంగళూరుల్లో కో-వర్కింగ్ కేంద్రాలను ఆఫీస్ ఏర్పాటు చేస్తుంది. కో-వర్కింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆఫీ్‌సకు హైదరాబాద్‌లో 14 కేంద్రాలు, బెంగళూరులో 23 కేంద్రాలు ఉన్నాయి. ఎన్‌ఎ్‌సఎల్‌తో భాగస్వామ్యం ఈ రెండు నగరాల్లో ఆఫీస్ కార్యకలాపాల విస్తరణకు దోహదం చేస్తుంది. ఒప్పందం మేరకు కో వర్కింగ్ భవనాలను ఎన్‌సీఎల్ సమకూరుస్తుం ది. బంజారాహిల్స్‌లోని ‘ఎన్‌ఎ్‌సఎల్ ఐకాన్’లో ఆఫీస్ కో-వర్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీని బిల్డ్‌అప్ ఏరియా 25,000 చదరపు అడుగులు.