ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్‌ రీఎంట్రీ

ABN , First Publish Date - 2023-10-03T03:30:38+05:30 IST

అంతర్జాతీయ ఔషధ తయారీ దిగ్గజం వియాట్రిస్‌ కు (గతంలో మైలాన్‌ ఇంక్‌) చెంది న భారత యాక్టివ్‌ ఫార్మాస్యూటిక ల్స్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ) వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు...

ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్‌ రీఎంట్రీ

ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేతికి వియాట్రిస్‌ భారత ఏపీఐ వ్యాపారం

హైదరాబాద్‌: అంతర్జాతీయ ఔషధ తయారీ దిగ్గజం వియాట్రిస్‌ కు (గతంలో మైలాన్‌ ఇంక్‌) చెంది న భారత యాక్టివ్‌ ఫార్మాస్యూటిక ల్స్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ) వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు పలు రంగాల్లో పెట్టుబడులు కలిగిన హై దరాబాద్‌ కంపెనీ ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వియాట్రిస్‌ తన వ్యాపార విక్రయం కోసం అంతర్జాతీయంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో తమ సంస్థ ప్రాధాన్య ఇన్వెస్టర్‌గా నిలిచిందని ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే, ఒప్పందం విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. మ్యాట్రిక్స్‌ ల్యాబొరేటరీస్‌, కేర్‌ హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీయే ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌. ఈ డీల్‌తో మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఫార్మా రంగంలోకి అడుగు పెట్టినట్లు అయింది. అంతేకాదు, గతంలో విక్రయించిన వ్యాపారాన్ని తిరిగి దక్కించుకున్నారు. 2006లో మ్యాట్రి క్స్‌ లాబొరేటరీ్‌సలో మెజారిటీ వాటా (71.5 శాతం) కొనుగోలు చేసిన మైలాన్‌ ఇంక్‌.. 2013లో కంపెనీ పేరును మైలాన్‌గా మార్చింది. 2020 నవంబరులో ఫైజర్‌కు చెందిన ఆఫ్‌ పేటెంట్‌ మెడిసిన్‌ విభాగమైన అప్‌జాన్‌ను విలీనం చేసుకున్న అనంతరం విలీన సంస్థ వియాట్రిస్‌గా పేరు మార్చుకుంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వియాట్రి్‌సకు పిట్స్‌బర్గ్‌, షాంఘై, హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. తాజా ఒప్పందంలో భాగంగా భారత్‌లో వియాట్రిస్‌ కలిగి ఉన్న ఆరు (హైదరాబాద్‌, విశాఖపట్నంలో మూడు చొప్పున) ఏపీఐ తయారీ యూనిట్లతోపాటు హైదరాబాద్‌లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) యూనిట్‌, థర్డ్‌ పార్టీ ఏపీఐ విక్రయాల డివిజన్‌ ఐక్వెస్ట్‌ పరం కానున్నాయి. ప్రస్తుతం ఈ యూనిట్లలో చాలామంది ఉద్యోగులు.. మ్యాట్రిక్స్‌ లాబొరేటరీ్‌సలో భాగంగా ఉన్నప్పటినుంచి పనిచేస్తున్నవారే. ‘‘ఔషధ రంగంలో భారీ పెట్టుబడి పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రంగంలో మాకిదే అతిపెద్ద పెట్టుబడి. ప్రపంచ ఫార్మా రంగంలో భారత్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఈ పెట్టుబడి పెడుతున్నాం’’ అని ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ కూతురు గుణపాటి స్వాతి రెడ్డి పేర్కొన్నారు.

గతంలో కేర్‌ హాస్పిటల్స్‌, ఏఐజీలోనూ నిమ్మగడ్డకు పెట్టుబడులు

ఫార్మాతో పాటు హెల్త్‌కేర్‌, మీడియా రంగాల్లోనూ నిమ్మగడ్డ ప్రసాద్‌ గతంలో పెట్టుబడులు పెట్టారు. కేర్‌ హాస్పిటల్స్‌, ఏఐజీ హాస్పిటల్స్‌ ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు వాటి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు, మా టీవీలోనూ ఆయన గతంలో పెట్టుబడులు పెట్టారు. 2015లో మా టీవీని స్టార్‌ నెట్‌వర్క్‌ కొనుగోలు చేసింది.

మహిళల ఆరోగ్య సంరక్షణ విభాగాన్నీ విక్రయించిన వియాట్రిస్‌

రుణభారాన్ని తగ్గించుకునేందుకు వియాట్రిస్‌ భారత్‌లోని మహిళల ఆరోగ్య సంరక్షణ (ఓరల్‌, ఇంజెక్టబుల్‌ కాంట్రాసెప్టివ్‌ ఔషధాలు) వ్యాపారాన్ని సైతం విక్రయించింది. ఈ విభాగాన్ని స్పెయిన్‌కు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీ ఇన్సడ్‌ ఫార్మా దక్కించుకుంది. అంతేకాదు, యూర్‌పలోని ఓటీసీ(ఓవర్‌ ది కౌంటర్‌) వ్యాపారంతోపాటు కొన్ని కీలకేతర మార్కెట్లలోని వాణిజ్య హక్కులను సైతం వదిలించుకుంది. భారత్‌లోని రెండు వ్యాపారాలను మొత్తం 120 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.9,960 కోట్లు) అమ్మినట్లు వియాట్రిస్‌ వెల్లడించింది.

Updated Date - 2023-10-03T03:30:38+05:30 IST