శ్రీరామ్ లైఫ్ నుంచి కొత్త యులిప్
ABN , First Publish Date - 2023-06-11T01:42:40+05:30 IST
శ్రీరామ్ గ్రూప్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్‌తో సరికొత్త యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులి్‌ప)ను తీసుకువచ్చింది. పాలసీదారులు పూర్తి జీవితకాలానికి లేదా ప్రత్యేక కాలానికి ఎంపిక...
శ్రీరామ్ గ్రూప్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్‌తో సరికొత్త యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులి్‌ప)ను తీసుకువచ్చింది. పాలసీదారులు పూర్తి జీవితకాలానికి లేదా ప్రత్యేక కాలానికి ఎంపిక చేసుకునేలా ఈ ప్లాన్‌ను రూపొందించింది. బహుళ ఫండ్ ఆఫ్షన్స్, పెట్టుబడి వ్యూహాలతో ఆర్థిక నియంత్రణ ఉండేలా ఈ కొత్త యులి్‌పను తీసుకువచ్చినట్లు శ్రీరామ్ లైఫ్ తెలిపింది. లైఫ్ గోల్, లెగసీ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉండనుంది. ఇందులో లైఫ్ గోల్.. నిర్దేశిత కాలానికి అందుబాటులో ఉండనుండగా లెగసీ మాత్రం 100 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు అందుబాటులో ఉండనుంది. శ్రీరామ్ గ్రూప్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆర్థిక రక్షణ, దీర్ఘకాలం పాటు మార్కెట్ కార్యకలాపాల్లో పాలసీదారులు పాలు పంచుకునేలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్‌తో ఈ కొత్త పాలసీలను తీసుకువచ్చినట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ కాస్పరస్ క్రోమౌట్ తెలిపారు.
ఉదాహరణకు పాలసీదారు 35 ఏళ్ల వయసులో లైఫ్ గోల్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని 30 సంవత్సరాల పాటు ఏటా రూ.3 లక్షలు పెట్టుబడిగా పెడితే సగటున ఏటా 8 శాతం రిటర్నులతో ఫండ్ విలువ రూ.2,93,37,365కు చేరుకుంటుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. అంతేకాకుండా మార్కెట్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకునేందుకు ఆటో ట్రాన్స్‌ఫర్ (ఏటీఓ) సదుపాయాన్ని ఎలాంటి చార్జీలు లేకుండా అందించనున్నట్లు పేర్కొంది.