బ్లూ స్టార్ నుంచి సరికొత్త డీప్ ఫ్రీజర్లు
ABN , First Publish Date - 2023-03-18T01:17:18+05:30 IST
ఏసీలు, వాణిజ్య రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థ బ్లూ స్టార్ లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త డీప్ ఫ్రీజర్లు విడుదల చేసింది.....

హైదరాబాద్: ఏసీలు, వాణిజ్య రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థ బ్లూ స్టార్ లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త డీప్ ఫ్రీజర్లు విడుదల చేసింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో డిజైన్ చేసిన ఈ ఫ్రీజర్లను మహారాష్ట్రలోని వాడా వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్టు కంపెనీ ఎండీ బీ త్యాగరాజన్ చెప్పారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 50 లీటర్ల నుంచి 600 లీటర్ల సామర్ధ్యంతో ఈ ఫ్రీజర్లను తయారు చేస్తున్నట్టు తెలిపారు. సైజును బట్టి వీటి ధర రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుందన్నారు.
శ్రీసిటీ ప్లాంట్ విస్తరణ: వాణిజ్య స్థాయి ఏసీల తయారీ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న తమ ప్లాంట్‌ను రూ.500 కోట్లతో మరింత విస్తరిస్తున్నట్టు త్యాగరాజన్ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కొత్తగా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు.
2025 నాటికల్లా ఈ కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈ ప్లాంటులో తయారు చేసే వాణిజ్యపరమైన ఏసీలను పశ్చిమాసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని బ్లూ స్టార్ భావిస్తోంది.