ముత్తూట్ వివాహసన్మానం ప్రాజెక్ట్
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:05 AM
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్)లో భాగంగా ముత్తూట్ వివాహసన్మానం ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా...
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్)లో భాగంగా ముత్తూట్ వివాహసన్మానం ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వితంతువులైన తల్లులకు తమ కుమార్తెల వివాహం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని ముత్తూట్ ఫైనాన్స్ అందించనుంది. ఆర్థిక సాయం అందుకోవాలనుకునే వారు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, మధురై, మంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. ఈ వివాహసన్మానం ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.40 లక్షలను కేటాయించినట్లు పేర్కొంది. ఈ పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. 2024 జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో జరిగే వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆర్థిక సాయం పొందాలనుకునే వారి నెలవారీ ఆదాయం రూ.10,000 కంటే తక్కువగా ఉండాలని తెలిపింది. అర్హత కలిగిన అమ్మాయిల తల్లులు..అవసరమైన డాక్యుమెంట్స్‌తో హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లోని మేనేజర్ (సీఎ్‌సఆర్), ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోనల్ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపింది.