స్పెషాలిటీ స్టీల్స్‌లోకి ఎంపీఎల్ గ్రూప్
ABN , First Publish Date - 2023-03-19T02:01:14+05:30 IST
స్పెషాలిటీ స్టీల్ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మహాలక్ష్మీ ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంపీఎల్ గ్రూప్) వెల్లడించింది. ఇందులో భాగంగా రూ.260 కోట్ల పెట్టుబడితో ఏటా 2 లక్షల టన్నుల...

రూ.260 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్: స్పెషాలిటీ స్టీల్ తయారీలోకి అడుగుపెడుతున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మహాలక్ష్మీ ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంపీఎల్ గ్రూప్) వెల్లడించింది. ఇందులో భాగంగా రూ.260 కోట్ల పెట్టుబడితో ఏటా 2 లక్షల టన్నుల సామర్థ్యం గల మెటాలిక్, నాన్ మెటాలిక్ అల్లాయ్ కోటెడ్/ప్లేటెడ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నట్లు ఎంపీఎల్ గ్రూప్ తెలిపింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాలక్కల్ గ్రామంలోని ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది కల్లా ఈ ఉత్పత్తులు వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయని ఎంపీఎల్ గ్రూప్ వెల్లడించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక ఫథకం (పీఎల్‌ఐ) కింద ఈ స్పెషాలిటీ స్టీల్స్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖతో ఎంపీఎల్ గ్రూప్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. స్పెషాలిటీ స్టీల్ కోసం ఇప్పటివరకు దిగుమతులపై ఆధారపడుతూ వస్తున్నామని, దేశీయంగా నెలకొల్పనున్న ఈ ప్లాంట్‌తో ఈ కొరత తీరనుందని ఎంపీఎల్ గ్రూప్ ఎండీ వినోద్ కుమార్ అగర్వాల్ అన్నారు.