ఇమ్యూన్‌యాక్ట్‌లో మరింత వాటా

ABN , First Publish Date - 2023-06-01T00:40:22+05:30 IST

సెల్‌ అండ్‌ జీన్‌ థెరఫీ కంపెనీ ఇమ్యూన్‌యాక్ట్‌ ఈక్విటీలో లారస్‌ ల్యాబ్స్‌ మరో 7.24 శాతం వాటా తీసుకుంది. ఇందుకోసం రూ.80 కోట్లు పెట్టుబడి పెట్టింది.

ఇమ్యూన్‌యాక్ట్‌లో మరింత వాటా

హైదరాబాద్‌: సెల్‌ అండ్‌ జీన్‌ థెరఫీ కంపెనీ ఇమ్యూన్‌యాక్ట్‌ ఈక్విటీలో లారస్‌ ల్యాబ్స్‌ మరో 7.24 శాతం వాటా తీసుకుంది. ఇందుకోసం రూ.80 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. దీంతో ఇమ్యూన్‌యాక్ట్‌ ఈక్విటీలో లారస్‌ ల్యాబ్స్‌ వాటా 33.86 శాతానికి చేరుతుంది. ఈ పెట్టుబడులకు ముందే లారస్‌ ల్యాబ్స్‌కు చెందిన కొంత మంది ప్రమోటర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది కూడా ఇదే ధరకు ఇమ్యూన్‌యాక్ట్‌ ఈక్విటీలో రూ.4 కోట్లతో 0.54 శాతం వాటా తీసుకున్నారు. సెల్‌ అండ్‌ జీన్‌ థెరఫీ టెక్నాలజీపై తమ ఆసక్తికి ఈ పెట్టుబడులు నిదర్శనమని లారస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్‌ చావా సత్యనారాయణ తెలిపారు. ఈ పెట్టుబడులతో ఇమ్యూన్‌యాక్ట్‌ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించనుంది.

Updated Date - 2023-06-01T00:40:22+05:30 IST