Share News

ఈపీఎ్‌ఫఓ సొమ్ముకు మరింత భద్రత

ABN , Publish Date - Dec 28 , 2023 | 02:31 AM

ఉద్యోగుల భష్య నిధి (ఈపీఎఫ్‌) భద్రతకు ఈపీఎ్‌ఫఓ మరిన్ని చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌ఓపీ) జారీ చేసింది...

ఈపీఎ్‌ఫఓ సొమ్ముకు మరింత భద్రత

న్యూఢిల్లీ: ఉద్యోగుల భష్య నిధి (ఈపీఎఫ్‌) భద్రతకు ఈపీఎ్‌ఫఓ మరిన్ని చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌ఓపీ) జారీ చేసింది. ఈ విధానం ప్రకారం ఎవరి ఈపీఎఫ్‌ ఖాతా నుంచైనా అక్రమంగా నగదు ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనుమానం వస్తే ఆ ఖాతాను నెల రోజుల పాటు ఫ్రీజ్‌ చేస్తారు. జాగ్రత్త కోసం అవసరమనుకుంటే ఈ గడువును మరో 14 రోజు పొడిగించవచ్చు. సభ్యుల గుర్తింపు నంబర్లు, యూఏఎన్‌లతో పాటు కంపెనీల గుర్తింపు నంబర్లకూ ఇది వర్తిస్తుంది. బోగస్‌ పత్రాలతో కేటుగాళ్లు సభ్యుల పీఎ్‌ఫను కాజేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఈపీఎ్‌ఫఓ ఈ చర్య తీసుకుంది.

Updated Date - Dec 28 , 2023 | 02:34 AM