21000 పాయింట్ల పైన మరింత బుల్లిష్!
ABN , First Publish Date - 2023-12-11T04:23:58+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ వారం లాభాల...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ వారం లాభాల స్వీకరణకు దిగే అవకాశాలున్నాయి. ఎఫ్‌పీఐలూ ఈ వారం నికర అమ్మకందారులుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ నిఫ్టీ 21000 పాయింట్ల స్థాయిని అధిగమిస్తే మాత్రం మరిం త అప్‌ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. వరుసగా గత ఆరు వారాల నుంచి లాభాలతో ముగియడం, సానుకూల సెంటిమెంట్‌ను సూచిస్తోంది. డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండడంతో ఈ వారంలో కూడా ఇంధన షేర్లలో జోరు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఈ వారం స్టాక్ రికమండేషన్లు :
హ్యాపీయెస్ట్ మైండ్స్ :
ఆరు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కౌంటర్ ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో ఉంది. చివరి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఈ కౌంటర్లో స్థిరత్వం కనిపిస్తోంది. గత వారం చివరి మూడు సెషన్లలోనూ ఈ షేర్లు లాభాలతోనే ముగిశాయి. శుక్రవారం 1.79 శాతం లాభంతో రూ.882 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.950/1060 టార్గెట్‌తో రూ.880/860 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.850ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
లారస్ ల్యాబ్ :
రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి ఈ కౌంటర్లో అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. డివిడెండ్ కూడా ప్రకటించడంతో మూమెంటమ్ మరింత పెరిగింది. లారస్ బయోలో వాటా మరింత పెంచుకోవడం ప్రధాన పాజిటివ్ అంశంగా మారింది. శుక్రవారం రూ.383 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.427/550 టార్గెట్‌తో రూ.380/370 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.350ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఆర్‌బీఎల్ బ్యాంకు :
కన్సాలిడేషన్‌తో ఆర్‌బీఎల్ బ్యాంకు కౌంటర్లో ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్స్ బాగా పెరిగాయి. ఈ బ్యాంకు షేర్లు శుక్రవారం ఏకంగా 4.51 శాతం పెరిగి రూ.267 వద్ద ముగిశాయి. రూ.310/390 టార్గెట్‌తో మదుపరులు రూ.260/250 స్థాయిల్లో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.245 స్టాప్‌లా్‌సను తప్పనిసరిగా పాటించాలి.
ఇండియా మార్ట్ :
గత రెండు నెలల్లో ఈ షేర్లు రూ.750 వరకు నష్టపోయిన ఈ కౌంటర్లో ఇపుడిపుడే సానుకూల కదలిక కనిపిస్తోంది. 2023 సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించాక షేర్ల ధరలోనూ స్థిరత్వం కనిపిస్తోంది. గత వారం ఈ కంపెనీ షేర్లు రూ.2677 వద్ద ముగిశాయి. రూ.2950/3100 టార్గెట్‌తో మదుపరులు రూ.2650 వద్ద ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.2,610 స్టాప్‌లా్‌సని తప్పనిసరిగా పాటించాలి.
వోల్టాస్ :
స్వల్ప డౌన్‌ట్రెండ్ తర్వాత వోల్టాస్ కౌంటర్లో ఇపుడిపుడే మూమెంటమ్ కనిపిస్తోంది. రూ.820 నుంచి ఈ కౌంటర్లో అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. గత 10 సెషన్ల నుంచి ట్రేడింగ్, వాల్యూమ్స్ కూడా బాగా పెరిగాయి. లాభాల స్వీకరణతో గత శుక్రవారం వోల్టాస్ షేర్లు రూ.855 వద్ద ముగిశాయి. రూ.920/1055 టార్గెట్‌తో రూ.850 వద్ద ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.826ను స్ట్రిక్ట్ స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్ట్ మాస్టర్