హైదరాబాద్‌పై మైక్రోచిప్‌ టెక్నాలజీ ఫోకస్‌

ABN , First Publish Date - 2023-01-20T03:43:40+05:30 IST

బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సీ).. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ఎంఎన్‌సీలు...

హైదరాబాద్‌పై మైక్రోచిప్‌ టెక్నాలజీ ఫోకస్‌

కోకాపేటలో 1.68 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ కొనుగోలు

హైదరాబాద్‌: బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సీ).. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు ఎంఎన్‌సీలు భారీ ఎత్తున ఆఫీస్‌ స్పేస్‌ను తీసుకోగా తాజాగా అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ దిగ్గజ సంస్థ మైక్రోచిప్‌ టెక్నాలజీ కోకాపేటలోని ‘వన్‌ గోల్డెన్‌ మైల్‌ టవర్‌’లో 1.68 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసింది. రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ద్వారా ఈ లావాదేవీ జరిగింది. అయితే ఎంత ధరకు ఈ కొనుగోలు జరిగిందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అమెరికాలోని అరిజోనా ప్రధాన కేంద్రంగా మైక్రోచిప్‌ టెక్నాలజీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కంపెనీకి మన దేశంలో ఇప్పటికే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లో పరిశోధనా, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు ఉన్నాయి. తాజా ఆఫీస్‌ స్పేస్‌ కొనుగోలుతో హైదరాబాద్‌ లో మరో పదేళ్ల వరకు తమ విస్తరణకు ఢోకా ఉండదని మైక్రోచిప్‌ టెక్నాలజీ భావిస్తోంది.

Updated Date - 2023-01-20T03:43:43+05:30 IST