ప్రీ-ఓన్డ్‌ కార్ల విక్రయాలపై మెర్సిడెస్‌ మరింత ఫోకస్‌

ABN , First Publish Date - 2023-06-26T01:39:25+05:30 IST

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌.. ఈ ఏడాది ప్రీ ఓన్డ్‌ కార్ల అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ ఏడాది కంపెనీ మొత్తం కార్ల విక్రయాల్లో ప్రీ ఓన్డ్‌ కార్ల విభాగం వాటా 20 శాతం...

ప్రీ-ఓన్డ్‌ కార్ల విక్రయాలపై మెర్సిడెస్‌ మరింత ఫోకస్‌

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌.. ఈ ఏడాది ప్రీ ఓన్డ్‌ కార్ల అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ ఏడాది కంపెనీ మొత్తం కార్ల విక్రయాల్లో ప్రీ ఓన్డ్‌ కార్ల విభాగం వాటా 20 శాతం పైగా ఉండేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. గత ఏడాది కంపెనీ మొత్తం 3,000 ప్రీ-ఓన్డ్‌ కార్లను విక్రయించిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రోజురోజుకు యూజ్డ్‌ కార్లకు డిమాండ్‌ పెరిగిపోతోందన్నారు. గతంలో ఈ కార్ల హోల్డింగ్‌ సమయం 30 నుంచి 45 రోజుల వరకు ఉండగా ఇది పది రోజులకు తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెర్సిడెస్‌ బెంజ్‌ డీలర్ల వద్ద మెర్సిడెస్‌ బెంజ్‌ సర్టిఫైడ్‌ పేరుతో కంపెనీ.. ప్రీ-ఓన్డ్‌ కార్లను విక్రయిస్తోంది.

Updated Date - 2023-06-26T01:39:25+05:30 IST