హైదరాబాద్‌లో మారుతి 4,500 సర్వీస్ టచ్‌పాయింట్
ABN , First Publish Date - 2023-06-07T02:53:36+05:30 IST
కారు కొనుగోలు చేసిన తర్వాత కారు యజమానికి సర్వీస్ అందించేందుకు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) పెద్దపీట వేస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కారు కొనుగోలు చేసిన తర్వాత కారు యజమానికి సర్వీస్ అందించేందుకు మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) పెద్దపీట వేస్తోంది. మారుతిలో కారు కొనుగోలు చేసిన తర్వాత ‘కాస్ట్ ఆఫ్ ఓనర్ షిప్’ చాలా తక్కువగా ఉంది. అందుకే పోటీ మార్కె ట్లో కూడా మారుతి సుజుకీకి 50 శాతం వాటా ఉందని ఎంఎ్‌సఐ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సర్వీస్) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్‌లో 4,500 సర్వీస్ టచ్‌పాయింట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 4,500 సర్వీస్ టచ్ పాయింట్లతో పెద్ద సర్వీస్ నెట్‌వర్క్‌ను మారుతి నిర్వహిస్తోందని చెప్పారు. గత సంవత్సరం 310 సర్వీస్ టచ్‌పాయింట్లను ప్రారంభించినట్లు చెప్పారు.