ప్రధాన మద్దతు 18,450
ABN , First Publish Date - 2023-06-26T01:55:33+05:30 IST
నిఫ్టీ గత వారం ఆల్‌టైమ్ హై 18,887 స్థాయి ని తాకి రియాక్షన్‌లో పడింది. ఈ కీలక స్థాయిలో ఏర్పడిన రియాక్షన్ ద్వారా ర్యాలీకి స్వల్ప విరామం ఇవ్వడమే కాకుండా స్వల్పకాలిక బలహీనత కూడా...
టెక్ వ్యూ
నిఫ్టీ గత వారం ఆల్‌టైమ్ హై 18,887 స్థాయి ని తాకి రియాక్షన్‌లో పడింది. ఈ కీలక స్థాయిలో ఏర్పడిన రియాక్షన్ ద్వారా ర్యాలీకి స్వల్ప విరామం ఇవ్వడమే కాకుండా స్వల్పకాలిక బలహీనత కూడా కనిపిస్తోంది. అంతే కాదు, ప్రస్తుత స్థాయిల్లో స్వల్పకాలిక నిరోధం కూడా ఏర్పడింది.. ప్రధాన ట్రెండ్ మాత్రం ఎగువకే ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది చాలా కాలంగా రావలసిన టెక్నికల్ కరెక్షన్ మాత్రమే. గత వారం ముగింపు స్థాయి 18,660 (వారంలో 160 పాయింట్ల నష్టం) వద్దనే గత ఏడాది డిసెంబరులో కరెక్షన్ ఏర్పడి 2,000 పాయింట్ల వరకు నష్టపోయినందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. శుక్రవారం నాటి అమెరికన్ మార్కెట్ ట్రెండ్ ఆధారంగా మార్కెట్ ఈ వారం అప్రమత్తంగానే ప్రారంభం కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్‌లో పడినట్టయితే మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించడానికి మైనర్ నిరోధం 18,750 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం, మానసిక అవధి 19,000. ఆ పైన మాత్రమే మార్కెట్ మరింత పురోగమిస్తుంది.
బేరిష్ స్థాయిలు: మరింత కరెక్షన్‌లో పడి మైనర్ మద్దతు స్థాయి 18,600 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది. మద్దతు స్థాయిలు 18,520, 18,450. రెండు వారాల క్రితం ఏర్పడిన స్వల్పకాలిక బాటమ్ కూడా ఇదే. ఈ 18,450 వద్ద కూడా విఫలమైతే స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కాక తప్పదు.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా కరెక్షన్ ట్రెండ్‌లో పడి 315 పాయింట్ల నష్టంతో ముగిసింది. మానసిక అవధి 44,000 వద్ద విఫలమైంది. మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించినట్టయితే ఈ మైనర్ నిరోధం కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 44,500. ఇదే కొద్ది వారాల క్రితం ఏర్పడిన ఆల్‌టైమ్ హై. దిగువన మద్దతు స్థాయిలు 43,300, 42,700.
పాటర్న్: మార్కెట్ గతవారం 18900 వద్ద ‘‘డబుల్ టాప్’’ ఏర్పరచుకుంది. ఇక్కడే స్వల్పకాలిక నిరోధం కూడా ఉంది. గత వారం మార్కెట్ 25 డిఎంఏ కన్నా దిగజారింది. 18,450 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి మద్దతు ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 18,700, 18,750
మద్దతు : 18,600, 18,520
వి. సుందర్ రాజా