మధుకాన్ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియకు బ్రేక్
ABN , Publish Date - Dec 14 , 2023 | 04:54 AM
మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై దివాలా ప్రక్రియను చేపట్టడానికి ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ, చెన్నై పక్కన పెట్టింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై దివాలా ప్రక్రియను చేపట్టడానికి ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ, చెన్నై పక్కన పెట్టింది. తీసుకున్న కోటి రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై శ్రేయీ ఎక్వి్‌పమెంట్ ఫైనాన్స్ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. శ్రేయీ పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియకు ఈనెల 8వ తేదీన ఆదేశించింది. ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ మధుకాన్ ప్రాజెక్ట్స్ ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లింది. ఈ అంశాన్ని మరో సారి పరిశీలించాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ కోరింది.