భారత మార్కెట్లోకి లోటస్ కార్స్
ABN , First Publish Date - 2023-11-10T02:07:50+05:30 IST
బ్రిటిష్ లగ్జరీ స్పోర్ట్‌కార్ బ్రాండ్ లోటస్ కార్స్.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ‘ఎలట్రె’ విడుదల చేయటం ద్వారా కంపెనీ..
మూడు ఎలక్ట్రిక్ కార్లు విడుదల
ప్రారంభ ధర రూ.2.55 కోట్లు
న్యూఢిల్లీ: బ్రిటిష్ లగ్జరీ స్పోర్ట్‌కార్ బ్రాండ్ లోటస్ కార్స్.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ‘ఎలట్రె’ విడుదల చేయటం ద్వారా కంపెనీ.. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. మొత్తం మూడు వేరియంట్ల (స్టాండర్డ్, ఎస్, ఆర్)లో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.2.55 కోట్లు, రూ.2.75 కోట్లు, రూ.2.99 కోట్లు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. 112 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ కార్లు ఒకసారి చార్జింగ్‌తో గరిష్ఠంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. చైనా ఆటోమోటివ్ కంపెనీ గీలే సంస్థకు చెందిన లోటస్ కార్స్... వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి తన ఇంటర్నేషనల్ కంబషన్ ఇంజన్‌తో రూపొందించిన ‘ఎమిరా’ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది మార్చిలో భారత్‌లో తొలి షోరూమ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఢిల్లీకి చెందిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్‌ను అధికారిక డిస్ట్రిబ్యూటర్‌గా లోటస్ కార్స్ నియమించుకుంది.