హైదరాబాద్‌లో లాయిడ్స్ టెక్నాలజీ కేంద్రం
ABN , First Publish Date - 2023-06-22T03:31:53+05:30 IST
యూకేకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది...
2023లో 600 మంది నిపుణుల నియామకం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): యూకేకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తున్న ఈ సెంటర్ ద్వారా కంపెనీ డిజిటల్ సామర్థ్యాలు పెరుగుతాయని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (గ్రూప్) రాన్ వాన్ కెమెండ్ తెలిపారు. 2023 చివరి నాటికి టెక్నాలజీ, డేటా, సైబర్ రంగాల్లో ప్రత్యే క నైపుణ్యాలు కలిగిన 600 మంది నిపుణులను నియమించుకోనున్నారు. ఇటీవల తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు బ్రిటన్ పర్యటించినప్పుడు హైదరాబాద్‌లో టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటుకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ అంగీకరించింది. వెంటనే టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించడం పట్ల మంత్రి కేటీ రామారావు ధన్యవాదాలు తెలిపారు.