Share News

నందిగామలో లిండ్‌స్ట్రోమ్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2023-11-09T02:56:04+05:30 IST

ఫిన్లాండ్‌ కంపెనీ లిండ్‌స్ట్రోమ్‌ ఇండియా హైదరాబాద్‌లో క్లీన్‌రూమ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకలగూడ గ్రామం వద్ద...

నందిగామలో  లిండ్‌స్ట్రోమ్‌ ప్లాంట్‌

నందిగామ (రంగారెడ్డి జిల్లా-ఆంధ్రజ్యోతి): ఫిన్లాండ్‌ కంపెనీ లిండ్‌స్ట్రోమ్‌ ఇండియా హైదరాబాద్‌లో క్లీన్‌రూమ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకలగూడ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ కోసం కంపెనీ 50 లక్షల యూరోలు (సుమారు రూ.44.5 కోట్లు) ఖర్చు చేసింది. ఈ ప్లాంట్‌ ద్వారా హెల్త్‌కేర్‌, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఆటోమొబైల్‌ రంగాలకు అవసరమైన ప్రత్యేక దుస్తులు, వాటి క్లీనింగ్‌ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం 100 మంది పని చేస్తున్న ఈ ప్లాంట్‌ను వచ్చే పదేళ్లలో 800 నుంచి 1,000 మంది పని చేసేలా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఫిన్లాండ్‌ రాయబారి కిమ్మో లహడెవిర్తా, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లిండ్‌స్ట్రోమ్‌ గ్రూపు ప్రెసిడెంట్‌, సీఈఓ జుహా లారియో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-09T02:56:08+05:30 IST