ప్లాస్టో నుంచి 8 లేయర్‌ వాటర్‌ టాంక్‌

ABN , First Publish Date - 2023-06-01T00:39:13+05:30 IST

నీటి స్టోరేజ్‌ టాంక్‌లు, పైప్‌లు, శానిటరీ వస్తువులు తయారుచేసే ప్లాస్టో 8 లేయర్ల నీటి స్టోరేజి టాంక్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

ప్లాస్టో నుంచి 8 లేయర్‌ వాటర్‌ టాంక్‌

హైదరాబాద్‌: నీటి స్టోరేజ్‌ టాంక్‌లు, పైప్‌లు, శానిటరీ వస్తువులు తయారుచేసే ప్లాస్టో 8 లేయర్ల నీటి స్టోరేజి టాంక్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. వాటర్‌ స్టోరేజి టాంకుల్లో ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుందని కంపెనీ తెలిపింది. దృఢత్వం, దీర్ఘకాలిక మన్నిక ఉండేలా దీన్ని తయారుచేసినట్టు పేర్కొంది. ఇందులోని బహుళ లేయర్లు యువి రేడియేషన్‌, ఉష్ణోగ్రతల ఆటుపోట్ల నుంచి సంపూర్ణ రక్షణ కలిగిస్తాయని కంపెనీ తెలిపింది.

Updated Date - 2023-06-01T00:39:13+05:30 IST